రాపూరు, జనవరి 04, (రవికిరణాలు) : ఆంధ్రప్రదేశ్ డీజీపీ, ఎస్పీ, ఆదేశాల మేరకు ఆపరేషన్ మస్కట్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు రాపూరు ఎస్ఐ కోటిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలల సంక్షేమ కొరకు బస్టాండ్, రైల్వే స్టేషన్, మెకానిక్ షెడ్, ఇటుక బట్టీలో దాదాపు 14 సంవత్సరాల లోపు ఉన్న చిన్నపిల్లలను గుర్తించి వాళ్లను పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చామని తెలిపారు. వాళ్ల తల్లిదండ్రులను విచారించి వాళ్ల సమస్యలు తెలుసుకుని వాళ్లకు తగు సూచనలు ఇచ్చి పాఠశాలకు పంపించే విధంగా చర్యలు తీసుకుంటామని ఎస్ఐ పేర్కొన్నారు.