ప్రమాదవశాత్తు ఎదైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు బిఎల్‌ఎస్‌ (బేసిక్‌ లైఫ్‌ సపోర్ట్‌) సేవ ఎంతో ప్రముఖమని ఇది ఒక ప్రాధమిక చికిత్స లాంటిదని డా|| ఎన్టీఆర్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ డా|| పి.శ్యామప్రసాద్ అన్నారు. స్థానిక నారాయణ మెడికల్ కళాశాల హాస్పిటల్ లోని యాక్సిడెంట్ అండ్‌ ఎమర్జెన్సీ విభాగాధిపతి డా|| కె.రఘు నేతృత్వంలోని ఈ బిఎల్‌ఎస్‌ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. అలాగే ఈ బిఎల్‌ఎస్‌ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ (ఉదా:ఒక వ్యక్తి గుండెపోటుకు గురై అకస్మాత్తుగా పడిపోతే బిఎల్‌ఎస్‌ వైద్య విధానం తెలిసిన వారు ప్రధమంగాప్రాధమిక చికిత్సా పద్ధతి ద్వారా 70% కోలుకునేలా చేయవచ్చు) ఈ సెంటర్ నారాయణ హాస్పిటల్ లో ప్రారంభం కావడం అందరికీ ఉపయుక్తమని, ముఖ్యంగా వైద్య విద్యార్థులు దీనిపై అవగాహన కలిగి ఉండడం తప్పనిసరియని, గతంలో ఈ బిఎల్‌ఎస్‌ సెంటర్లు విశాఖపట్నం, తిరుపతి లలో మాత్రమే అందుబాటులో ఉండేవని, ప్రస్తుతం ఉన్న అత్యంత అధునాతన టెక్నాలజీతో ఈ బిఎల్‌ఎస్‌ సెంటర్‌ను నెల్లూరు వాసులకు అందుబాటులోకి తెచ్చిన ఘనత నారాయణ విద్యాసంస్థల అధినేత డా|| పొంగూరు నారాయణ గారికి దక్కుతుందని, ఇందుకు ఒక నెల్లూరు వాసిగా ఎంతో గర్విస్తున్నానని, ఈ సెంటర్‌ను ఏర్పాటు చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న విషయమని, వ్యాపార దృక్పధంతో కాకుండా సేవాభావంతో ప్రారంభించినందుకు డా|| పి.నారాయణకి ఆయన సభాముఖంగా అభినందనలు తెలిపారు.అలాగే నారాయణ హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన అత్యాధునిక పరికరాలు, ఇక్కడ
అవలంభిస్తున్న చికిత్సా విధానాలు, సేవాపద్దతులు తనను ఎంతగానో ఆకర్షించాయని, ఇటువంటి అత్యున్నత ప్రపంచస్థాయి ప్రమాణాలు కలిగిన మెడికల్ కళాశాల హాస్పిటల్ డా|| ఎన్టీఆర్ యూనివర్శిటీ పరిధిలో ఉండడం హర్షించదగ్గ విషయమని అభిప్రాపడ్డారు.ఈ బిఎల్‌ఎస్‌ సేవా విధానం గురించి ఒక్క మెడికల్ విద్యార్థులే కాకుండా సగటు పౌరుడు కూడా తెలుసుకోవలసిన ఆవశ్యకత ఎంతగానో ఉందని, ఇందుకోసం హాస్పిటల్ వారు, విద్యార్ధులు జనసమూహం ఎక్కువగా ఉన్న (షాపింగ్ మాల్స్, బీచ్, పార్కులు, బస్టాండ్) ప్రాంతాలలో అవగాహన వైద్య శిబిరాలు నిర్వహించాలని ఆయన కోరారు.

రక్తదాన శిబిరం :
నారాయణ మెడికల్ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్ధులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని డా|| ఎన్టీఆర్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ డా|| పి. శ్యామప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకూ తాను 84 సార్లు రక్తదానం చేశానని, ప్రతిఒక్కరూ రక్తదాన ఆవశ్యకతను తెలుసుకుని స్వచ్చందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు.ఈ కార్యక్రమంలో నారాయణ హాస్పిటల్ సీఈవో డా|| ఎస్. సతీష్ కుమార్, అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డా|| బిజురవీంధ్రన్, నారాయణ మెడికల్ గ్రూప్ అకడమిక్ కో-ఆర్డినేటర్ డా|| సర్వేపల్లి విజయకుమార్, డీన్ డా|| సూర్యప్రకాశ్ రావు, నారాయణ డెంటల్ కళాశాల ప్రిన్సిపాల్ డా|| అజయ్ రెజినాల్డ్, మెడికల్ అడ్మినిస్ట్రేటర్ డా|| వై.వి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.