నెల్లూరు, జనవరి 26, (రవికిరణాలు) : విక్రమ సింహపురి యూనివర్సిటీ జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో మినిస్ట్రీ అఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ వారి ఆర్థిక సహకారముతో ఒక్కరోజు భారీ స్వచ్ఛత కార్యక్రమాన్ని సిటీలోని  వివిధ బహిరంగ ప్రదేశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఆర్ సుదర్శన రావు ముఖ్యఅతిదిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భముగా ఆయన మాట్లడుతూ పరిశుభ్రత మీద సామాజిక బాధ్యతతో జిల్లా వాసులలో అవగాహన తీసుకొని రావాలని అన్నారు. వ్యర్ధ గణ పదార్ధాల విసర్జన తగ్గించుకోవాలని తద్వారా అనేక రకాల దుష్ప్రభావాలు నివారించవచ్చని
అన్నారు. చివరిగా మనము చేసే నినానాదాలు విధానాలుగా మారితే ఒక మంచి సమాజాన్ని మన భావితరానికి అందించగలుగుతామన్నారు. ఈ కార్యక్రమములో నెల్లూరులోని వివిధ కళాశాల నుంచి సుమారు 300 మంది జాతీయ సేవా పధకం వాలంటీర్లు మరియు ప్రోగ్రాం అధికారులు ర్యాలీగా నినాదాలు చేసుకుంటూ విఆర్ కళాశాల నుంచి ఆర్టిసి బస్టాండ్ పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ అవగాహన కల్పించారు. తదనంతరము వివిధ కళాశాల నుంచి వచ్చిన వాలంటీర్లు 4టీంలు గా ఏర్పడి సిటీలోని విఆర్ సెంటర్, మార్కెట్, ఆర్టిసి బస్టాండ్, రైతు బజార్, కెవిఆర్ సర్కిల్ పరిసర ప్రాంతాలలో స్వచ్ఛ్ భారత్ కార్యక్రమము నిర్వహించటం జరిగింది. జాతీయ సేవా  పథకం సమన్వయకర్త డా.ఉదయ్ శంకర్ అల్లం మాట్లాడుతూ ఒక్కరోజు భారీ స్వచ్ఛత కార్యక్రమమునకు మినిస్ట్రీ అఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ వారు ఆర్ధిక సహాయం అందించటం జరిగిందని చెప్పారు. ఒక్కరోజు భారీ స్వచ్ఛత కార్యక్రమమును చేపట్టటానికి సహకారము అందించిన మున్సిపల్ కార్పొరేషన్ కమిషనేర్ కి ఎన్‌ఎస్‌ఎస్‌ రీజినల్ డైరెక్టర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసారు. ముగింపు కార్యక్రమమునకు రిజిస్ట్రార్ ఆచార్య అందె ప్రసాద్ పాల్గొని, పాల్గొన్న ప్రతి వాలంటీరును అభినందించి  సర్టిఫికెట్స్ అందించారు. చివరిగా మార్కెట్యార్డు చైర్మన్ యేసు నాయుడు ఆర్టిసి రీజినల్ మేనేజర్ శేషయ్య ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమములో వివిధ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారులు విశ్వవిద్యాలయ అధ్యాపకులు కళాశాల ప్రిన్సిపల్స్ పాల్గొన్నారు.