నాణ్యతలేని గుడ్లు వస్తున్నా పట్టించుకోని అధికారులు.. 
చిట్టమూరు మండలంనార్త్ వత్తురు అంగనవాడిలో బయటపడ్డ మురిగిన కోడిగుడ్లు..                      మురిగిన గుడ్లని తెలిసినా వండిపెడుతున్న అంగనవాడి సిబ్బంది..

కోట, జనవరి 07, (రవికిరణాలు) : చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందిస్తూ మాతాశిశు మరణాలను తగ్గించేందుకు ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా సరఫరా చేస్తున్న పౌష్టికాహారంలో నాణ్యత లోపిస్తోంది. ఐసీడీఎస్‌ అధికారులు ఉదాసీనత కారణంగా కాంట్రాక్టర్లు నాసిరకం సరుకులను అంగనవాడి కేంద్రాలకు పంపిణీ చేస్తుసొమ్ముచేసుకుంటున్నారు.  పెద్దసైజు కోడిగుడ్ల స్థానంలో చిన్నసైజు గుడ్లు రావడం, మురిగిన గుడ్లును సరఫరా చేస్తున్నారు. గుడ్లు మురిగినవని తెలిసినా అంగనవాడి సిబ్బందికి తెలిసికూడా వండిపెడుతున్నారు. ఈ గుడ్లను తిన్న చిన్నారులు, గర్భిణులు, బాలింతలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. చిట్టమూరు మండలం నార్తువత్తురు గ్రామ అంగనవాడి కేంద్రంలో బయటపడ్డ ఈ మురిగిపోయిన కోడిగుడ్లును చూసిన పిల్లల తల్లిదండ్రులు మండిపడుతున్నారు..ఈ అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో 30 మందికి పైగా బాలింతలు, గర్భిణులు,  చిన్నారుఉన్నారు.. వీరికి పౌష్టికాహారం కింద ప్రతి నెల డజనుకుపైగా కోడిగుడ్లను అందజేస్తోంది. అయితే టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు మురిగిన, సైజు లేని కోడిగుడ్లను
అందజేస్తుండంతో గుడ్లను తిన్న చిన్నారులు, గర్భిణులు రోగాల బారిన పడి ఆస్పత్రుల పాలవుతున్న సంఘటనలు గతంలో చోటుచేసుకున్నాయి. అయితే అప్పట్లో గ్రామస్తులు సర్దుకున్నట్లు సమాచారం.. అయితే మంగళవారం కూడా అదే పరిస్థితి నెలకొంది.. ఓ చిన్నారికి వచ్చిన గుడ్డు పూర్తిగా మురిగిపోయి ఉండటంతో గ్రామస్తులు మీడియాకు తెలియజేశారు.. సుమారు  నెల నుంచి తరచూ మురిగిన కోడిగుడ్లను సరఫరా చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గర్భిణులు, బాలింతలు ఆరోపిస్తున్నారు..ఇప్పటికైనా అధికారులు చొరవచూపి అంగనవాడి కేంద్రాలపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.