కోవూరు నియోజక వర్గం కొడవలూరు మండలం శివాలయం దగ్గర అరుంధతి నగర్ లో 30సంవత్సరాల క్రిందట పేదలకు కేటాయించిన ఇళ్లస్థలాలను ప్రస్తుత ప్రభుత్వం వేరే వారికి కేటాయించి నిర్దాక్షిణ్యంగా ఇళ్లను కూల్చివేయటం జరిగింది,ఈ విషయం మై జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చెన్నారెడ్డి_మనుక్రాంత్ ని నిరాశ్రయులు సంప్రదించగా,వారికి మద్దతు గా జిల్లా కార్యాలయం నుండి  జనసైనికులు దీక్ష లో పాల్గొన్నారు... ఈ సందర్భంగా యూత్ వింగ్ ఇన్ ఛార్జ్ గునుకుల కిషోర్ మాట్లాడుతూ..... 30 సంవత్సరాలుగా కనీస అవసరాలు కల్పించలేక రోడ్ల మార్జిన్ల పై నివసిస్తున్న ప్రజల ఇళ్లు కూల్చివేసి భూములను లాక్కుని,రెండెకరాలన్న భూస్వాములకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సంకల్పించిన ఈ ప్రభుత్వానికి ఈ పేదలు అర్హులుగా కనిపించ లేదా,ఈ విషయం కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి వీరికి న్యాయం జరిగే విధంగా మనుక్రాంత్ నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తాం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో గునుకుల కిషోర్,కోవూరు ఇన్ఛార్జ్ శ్రీనివాసులు రెడ్డి, సుధీర్ బద్దెపూడి,శ్రీకాంత్,ప్రశాంత్,వంశీ గుంటక,శేఖర్ తదితరుల పాల్గొన్నారు