శ్రీ పట్టాభి రాముని నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ 


వాకాడు: నెల్లూరు జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాళెం గ్రామంలో వెలసియున్న శ్రీశ్రీశ్రీ పట్టాభిరామచంద్రస్వామి వారి దేవాలయంలో 2022 ఆంగ్ల సంవత్సర క్యాలెండర్ ను వాకాడు సొసైటీ చైర్మన్ ఆలయ నిర్వాహకులు కొడవలూరు రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దాతల సహకారంతో క్యాలెండరును ఆవిష్కరించడం జరుగుతుందని , ఈ సందర్భంగా దాతలు అందరికీ  హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.. ఆలయ అర్చకులు దీవి అనంతాచార్యులు మాట్లాడుతూ గత కొద్ది సంవత్సరాలుగా దాతల సహకారంతో, చెన్నైలోని యువకుల ప్రోత్సాహంతో క్యాలెండర్లను ప్రింట్ వేయించి భక్తులందరికీ ఉచితంగా అందిస్తున్నామనీ , ఇదే ఉత్సాహంతో మున్ముందు మరెన్నో దైవిక కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని ఆలయ అభివృద్ధికి తోడ్పడి, శ్రీ సీతారాముల అనుగ్రహం పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ రామ సేన అధ్యక్ష, కార్యదర్శులు హరీష్ రెడ్డి , శివ కుమార్ ,  శ్రీనివాసులురెడ్డి , నరేంద్రరెడ్డి, కిరణ్ కుమార్, గురుమూర్తి ,గురు ప్రసాద్, రాజేష్, వంశీ, దినేష్ తదితరులు పాల్గొన్నారు