ఢీ అంటే ఢీ అనే వారిలో నెల్లూరు  రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి ముందు వరుసలో ఉంటారు... ఎన్నికల సమయంలో అత్యంత దూకుడుగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కనిపించారు.. గత ఒకటిన్నర సంవత్సరాలుగా ఎన్నో పరిణామాలు జరిగాయి. ఎందుకో ఈ మధ్య ఆయన పూర్తిస్థాయిలో విభిన్నంగా రాజకీయ అడుగులు వేస్తూ కనిపిస్తున్నారు... ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలని మిగిలిన సమయంలో రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరం అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని పిలుపునిస్తున్నారు... శుక్రవారం నెల్లూరు పడారుపల్లి లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఆయన కార్యకర్తలకు, నాయకులకు ఒకటే ఒక సూచన చేశారు..నన్ను ద్వేషించే వారిని కూడా నేను ప్రేమిస్తా... వారి బాగు కోసం నిరంతరం దేవుని ప్రార్థిస్తూ అదే బాటలో వైసీపీ నేతలు కార్యకర్తలు కూడా పయనించాలని ఆయన పిలుపునిచ్చారు... అధికార పార్టీని రెచ్చ కొట్టాలని ప్రతిపక్షం నేతలు అన్ని రకాలుగా కవ్వింపు చర్యలు చేస్తున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రం తనదైన శైలిలో విభిన్నంగా అడుగులు వేసుకుంటూ వెళ్తున్నారు..