నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 27వ డివిజన్ చంద్రమౌళి నగర్ లోని 4, 6వ వీధులకు, సావిత్రి నగర్ లోని 3వ వీధిలోని  సిమెంటు రోడ్డులకు శంకుస్థాపన చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 

27వ డివిజన్ లో జరిగిన జగనన్న మాట- కార్యకర్తలు ఇంటికి కోటంరెడ్డి బాట కార్యక్రమంలో స్థానిక ప్రజలు ఈ రోడ్డు సమస్య నా దృష్టికి  తీసుకు వచ్చిన వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి రోడ్డు పనులకు మంజూరు చేయించి శంకుస్థాపన చేయడం జరిగింది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 

నాణ్యత ప్రమాణాలతో త్వరితగతిన రోడ్డు పనులు పూర్తిచేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించిన. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 

 నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వరదలవల్ల దెబ్బతిన్న రోడ్లపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని, అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, వీలైనంత త్వరగా రోడ్ల పనులను పూర్తి చేయించడమే నా ప్రధమలక్ష్యం. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 

పై కార్యక్రమంలో 27వ డివిజన్ కార్పొరేటర్ భీమినేని మురహరి, మాజీ కౌన్సిలర్ వెనుంబాక సుధాకర్ రెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు సన్నపరెడ్డి సుబ్బా రెడ్డి, స్థానిక వైసీపీ నాయకులు సతీష్, మస్తాన్ రెడ్డి, కుమార్, రంగారెడ్డి, చిన్న, సురేంద్ర రెడ్డి, మోహన్, చలపతి, మణి, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.