ఆ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా మాజీ మేయర్ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇంచార్జ్, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు హాజరయ్యారు

ఈ సందర్బంగా అబ్దుల్ అజీజ్ గారు మాట్లాడుతూ....

అధికారం ఉన్నా లేకపోయినా, పదవి ఉన్నా లేకపోయినా, వ్యక్తిత్వo శాశ్వతంగా ఉంటుందని అన్నారు...

నిజమైన మనిషి ఎప్పుడు డబ్బు వచ్చినప్పుడు ఒక విధంగా డబ్బు లేనప్పుడు ఒక విధంగా ఉండరు  అని అన్నారు..

2015 నుంచి ఈ రోజు వరకు 156 మందికి  ప్రతినెల 200 రూపాయల పింఛన్ తన సొంత డబ్బులతో ఇస్తున్నాడని అన్నారు...

 క్రిస్మస్ వస్తుందని ప్రతి ఒక్కరూ ఆనందంగా పండుగ చేసుకోవాలనే ఉద్దేశంతో తన భార్య బిడ్డలు ఎలాంటి బట్టలు  అయితే వేసుకుంటారో అలాంటి బట్టలు వీరికి  కూడా ఇచ్చారని అన్నారు...

ఇంత మంచి కార్యక్రమంలో మేము కూడా భాగస్వాములయ్యాము ఇక్కడ ఉన్న  పాస్టర్లు అందరూ కూడా ఇందులో భాగస్వాములయ్యారు..

ప్రశాంత్ తన స్నేహితులతో కలిసి కలిసి క్లాప్స్ ఆర్గనైజెషన్ ను స్థాపించి నెల నెల వీరికి 200 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారని అన్నారు...

ఇతనికి ఇంకా భగవంతుడు పేదలకు సహాయం చేసే గుణాలను ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆ భగవంతుడ్ని ప్రార్ధిస్తున్నానాను అని అన్నారు...

ఇక్కడ ఉన్న అవ్వలు, తాతలు, అక్కలు అందరూ ఆరోగ్యాంగా ఉండాలని ఆ భగవంతుడ్ని ప్రార్ధిస్తున్నాను అని అన్నారు....

ఈ కార్యక్రమం లో ఫాదర్ జోసెఫ్, గ్రంధాలయ మాజీ డైరెక్టర్ జలదంకి సుధాకర్, నగర మైనారిటీ అధ్యక్షులు సాబీర్ ఖాన్, ఫిరోజ్ ఖాన్ పాల్గొన్నారు...