సీఎం వర్చువల్ మీటింగ్ లో నెల్లూరు ఎంపీ ఆదాల
 నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కలెక్టరేట్లో మంగళవారం జరిగిన సీఎం వర్చువల్ మీటింగులో పాల్గొన్నారు. మధ్యతరగతి వర్గాల వారి కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న ఎమ్.ఐ.జి లేఔట్ల వివరాలను సీఎం జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ మీటింగ్‌లో కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే  రామ్‌రెడ్డి  ప్రతాప్‌కుమార్‌రెడ్డి  తదితరులను సీఎం పలకరించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఒక బ్రోచర్‌ను కూడా విడుదల చేశారు. నెల్లూరు వర్చువల్ మీటింగ్‌లో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, నెల్లూరు మేయర్ శైలజ, జాయింట్ కలెక్టర్, హరేందిర ప్రసాద్, డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతి, నుడ చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్, విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, జడ్పిటిసి మల్లు సుధాకర్ రెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు ఎమ్.ఐ.జి లేఔట్ బ్రోచర్‌ను విడుదల చేశారు.