నెల్లూరు రంగనాథ స్వామి రథోత్సవం లో నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మంత్రి అనిల్ కుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి లతో కలిసి పాల్గొన్నారు. అంతకుముందు  ఆదాల ప్రభాకర్ రెడ్డి  స్వామివారికి  పట్టు వస్త్రాలను  బహూకరించారు. రథోత్సవాన్ని పురస్కరించుకుని భక్తులు జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో విచ్చేశారు. రథోత్సవం కారణంగా రంగనాయకుల స్వామి ఆలయం సమీపంలో వీధులు భక్తులతో కిక్కిరిసిపోయాయి. రంగనాయకుల స్వామి ఆలయ ప్రధాన వీధిలో  పలు సంస్థలు వ్యక్తులు అన్న దానాలు చేశారు. కొందరు భక్తులు రంగనాథస్వామి పేరుతో నినాదాలు చేస్తూ జట్లు జట్లుగా ఆలయానికి వచ్చారు. రథోత్సవం సందర్భంగా నినాదాలు మిన్నంటాయి. భక్తులు ఉత్సాహంగా రథం లాగుతూ ముందుకు కదిలారు. ఈ కార్యక్రమంలో రూప్ కుమార్ యాదవ్, కోటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.