జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నెల్లూరు జిల్లా సమీక్షా సమావేశం.... 
నెల్లూరు జిల్లా సమీక్షా సమావేశం టిడిపి నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన గురువారం ప్రారంభమైంది...ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన రేపల్లె శాసనసభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనగాని సత్యప్రసాద్, బనగాని పల్లి మాజీ శాసనసభ్యులు, ఒంగోలు, నెల్లూరు పార్లమెంట్ల కో- ఆర్డినేటర్ బీసీ జనార్ధన్ , మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర తో పాటు పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు..గత రెండున్నర సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చించారు. మండల స్థాయి నుంచి ఉద్యమాలు ప్రారంభించాలని ఎక్కడికక్కడ ప్రజలను చైతన్యవంతం చేయాలని ముఖ్య అతిథులు సూచించారు...జిల్లాలో పార్టీని బలోపేతం చేయాలన్నారు. ఉపాధి హామీ పనులకు సంబంధించి సాధించిన విజయం, గత రెండు నెలల కాలంలో టిడిపి చేసిన పోరాటాల గురించి ఈ సమీక్ష సమావేశంలో చర్చిస్తున్నారు...

ఈ సమావేశంలో చేజర్ల వెంకటేశ్వర రెడ్డి, పరసా రత్నం, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, బొల్లినేని రామారావు, పాశిం సునీల్ కుమార్, కురుగొండ్ల రామకృష్ణ, బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, దివి శివరాం, ఇంటూరి రాజేష్, జన్ని రమణయ్య, పెళ్ళకూరు శ్రీనివాసులురెడ్డి, గూటూరు మురళి కన్నబాబు, కంభం విజయరామిరెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ చంచల్ బాబు యాదవ్ , తాళ్ళపాక అనురాధ, dr. జెడ్ శివ ప్రసాద్, ఊరాందూరు సురేంద్ర బాబు, పట్టాభి రామిరెడ్డి,  బొమ్మీ సురేంద్ర, వేలూరు రంగా రావు, దావా పెంచల్ రావు, మొగలి కల్లయ్య, బొమ్మన శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు