- రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా|| పి.అనీల్ కుమార్
నెల్లూరు, జనవరి 17, (రవికిరణాలు) : నెల్లూరు నగరంలోని నవాబుపేట నందు గల శివాలయంలో ఆలయ పాలకవర్గ ఛైర్మన్, సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి పి.అనీల్ కుమార్ పాల్గొన్నారు. ఆలయ ఛైర్మన్ గా వంగాల శ్రీనివాసులురెడ్డి, సభ్యులుగా మినుం వెంకటేశ్వర్లు, కాకి లీలారాణి, వి.చంద్రశేఖరయ్య, సానిశెట్టి సంధ్యాలక్ష్మి, ఎస్. జ్యోతిప్రియలు ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ శివాలయం పాలకవర్గ ప్రమాణస్వీకారం చేస్తున్న చైర్మన్, సభ్యులకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని, అలాగే కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు ధన్యవాదాలు
తెలియజేస్తున్నానన్నారు. ఆ భగవంతునికి సేవ చేస్తూ, దేవస్థానాన్ని అభివృద్ధి చేసేవారు ఆలయ పాలకవర్గ సభ్యులుగా ఉండాలన్న ఆలోచనతోనే సభ్యులను ఎన్నుకోవడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే దేవస్థాన పాలకవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరుగుతోందన్నారు. దేవాదాయశాఖ మంత్రితో మాట్లాడి పురాతన దేవస్థానమైన నవాబుపేట శివాలయాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలియజేస్తున్నానన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండ అన్ని వసతులతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఆలయ అభివృద్ధికి రూ.1.5 కోట్లు అంచనా వేశామని, అవసరమైతే ఇంకా ఎక్కువ నిధులు తీసుకొస్తామన్నారు. మరో రెండేళ్ళలో శివాలయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచి మాతో సహకరిస్తూ ప్రయాణిస్తున్న ఆలయ ఛైర్మన్ వంగాల శ్రీనివాసులురెడ్డికి అభినందనలు తెలియజేస్తున్నానన్నారు. ఈ ఐదేళ్ళలో నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలోని అన్ని దేవాలయాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని, అలాగే అర్చకులకు ప్రతినెలా జీతాలు అందించే కార్యక్రమం చేపడుతామన్నారు. దేవస్థానాలలో అవినీతికి తావులేకుండా నీతినిజాయితీతో కూడిన సభ్యులను నియమించడం జరిగిందన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత అన్నింటిలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి రాష్ట్ర కార్యదర్శి ముక్కాల ద్వారకనాథ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో స్థానిక మాజీ కార్పొరేటర్ దామవరపు రాజశేఖర్, నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, వై.వి.రామిరెడ్డి, సంక్రాంతి కళ్యాణ్, తిప్పిరెడ్డి రఘురామిరెడ్డి, కువ్వారపు బాలాజీ, తుంగా ఇందూధర్ రెడ్డి, తంబి, పప్పు నారాయణ, పోలంరెడ్డి వెంకటేశ్వర్లురెడ్డి, యర్రంరెడ్డి మాధవరెడ్డి, దొంతాలి రఘు, తదితరులు పాల్గొన్నారు.