కోవూరు, జనవరి 03, (రవికిరణాలు) : కోవూరు జిల్లా పరిషత్ బాలికొన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్ నరసింహమూర్తి ఈ పాఠశాల అభివృద్ధికి ఎనలేని సేవలు చేసారని దానికీ గుర్తింపుగా ఆయనను రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రధానోపాధ్యాయులుగా ఎంపిక చేసారని కోవూరు మాజీ జడ్పిటిసి సభ్యులు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి అన్నారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రధానోపాధ్యాయులుగా ఎంపికయ్యిన కోవూరు జడ్పి బలికొన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్ నరిసింహమూర్తిని ఈరోజు బాలికొన్నత పాఠశాల లో కోవూరు మాజీ జడ్పిటిసి సభ్యులు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహజంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులు ను ఎంపిక చేస్తారని,అయితే నరిసింహమూర్తి ఈ పాఠశాల అభివృదికి చేసిన సేవలను గుర్తించిన ఆర్ జెడి గతములో ఎన్నడూ లేనివిధంగా దాదాపు 9 నెలల ముందుగానే నరిసింహమూర్తి ని ఉత్తమ ప్రధానోపాధ్యాయులుగా ఎంపిక చేయడము అభినందనీయమని, నరిసింహమూర్తి ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు స్వీకరించి 3 సంవత్సరాల అయిందని ఈ సమయంలో ఈ పాఠశాలలో విద్యార్థులు సంఖ్యను గణనీయంగా పెంచడముతో పాటు 10 వ తరగతిలో మంచి ఫలితాలు తెచ్చారని,అదేవిధముగా జూనియర్ రెడ్ క్రాస్ ఈ పాఠశాలలో ఏర్పాటు చేసి అందరికి అవగాహన కలిపించడము తో పాటు, ఈ పాఠశాల విద్యార్థులు అనేక విభాగాలలో మంచి నైపుణ్యం సాధించి జిల్లా,రాష్ట్ర,జాతీయ స్థాయిలో అనేక పురస్కారాలు సాధించడము వెనుక నరిసింహమూర్తి కృషి ఎంతో ఉందని, వారు భవిష్యత్తు లో అనేక అవార్డులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇందుపూరు మురళీకృష్ణ రెడ్డి, పాలపర్తి శ్యాం, అగ్గి మురళి, గరికిపాటి అనిల్, జానకిరాం, బాబు తదితరులు పాల్గొన్నారు.