నెల్లూరు, ఫిబ్రవరి 03, (రవికిరణాలు) : సిఏఏ, ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్ ముస్లిము ల సమస్య మాత్రమే కాదని మొత్తం భారతీయుల సమస్య అని రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్‌పిఆర్‌లో అభ్యంతరకర ప్రశ్నలను రద్దు చేస్తూ ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి స్పష్టమైన జిఓ ఇచ్చారన్నారు. సిఏఏ, ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్ లను వ్యతిరేకిస్తూ 9వ తేదీ సాయంత్రం 4 గంటలకు కస్తూరిదేవి గార్డెన్స్ ఎదురుగా భారత రాజ్యాంగ పరిరక్షణ సభ నిర్వహిస్తున్నామని, సిఏఏ, ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్ లకు వ్యతిరేకముగా దేశంలో ప్రతి లౌకికవాద ఎమ్మెల్యే, ఎంపీ వీధుల్లోకి రావాలని పిలుపునిచ్చారు.