ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్‌, సిఏఏ చట్టాలకు వ్యతిరేకంగా నెల్లూరులో పోరాటం చేస్తున్న ముస్లిం పెద్దలు, జెఏసి నాయకులతో కలసి నేడు జలవనరులశాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజకీయసలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిని అమరావతి, తాడేపల్లిలోని వారి నివాసం వద్ద కలవడం జరిగింది.

ఈ చట్టాల ద్వారా ముస్లింలలో ఉన్న భయాందోళనలు తెలియజేసి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు అండగా నిలబడాలని, అదేవిధంగా ఎన్‌పిఆర్‌ ను రాష్ట్రంలో అమలుచేయకుండా అసెంబ్లీ లో తీర్మాణం చేయాలని, రాజ్యాంగ విరుద్ధమైన సిఏఏ కు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీమ్ కోర్టులో కేసులు వేయాలని మంత్రి, ఎమ్మెల్యే, ముస్లిం పెద్దలు  మరియు జెఏసి నాయకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  రాజకీయసలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిని కోరారు.

పై కార్యక్రమంలో జెఏసి నాయకులు ముక్తి ఇలియాజ్, ప్రధాన కార్యదర్శి కరీముల్లా, జియా ఉల్హగ్, ముస్తాఫ్ మదానీ, కైఫీయతుల్లా, షకీల్, మస్తాన్, ముస్లిం నాయకులు మొహ్మద్ షమీ, సలీం, అంజా హుస్సేన్, షంషుద్దీన్, కంతరలి, సత్తార్, ఇస్మాయిల్ ఖాద్రి, చిన్న మస్తాన్, రియాజ్, సంధాని, అబ్దుల్ రజాక్, కరీముల్లా, మౌలాలి తదితరులు పాల్గొన్నారు.