నెల్లూరు, జనవరి 8, (రవికిరణాలు) : ఫిబ్రవరి 29వ తేదీ గుంటూరులో జరుగనున్న యానాదుల  చైతన్య భేరీకి తరలిరావాలని యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుడమల రామచంద్రయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెసి పెంచలయ్య పిలుపునిచ్చారు. బుధవారం నెల్లూరులోని వెన్నెలకంటి రాఘవయ్య భవన్లో యానాదుల సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా కార్యవర్గం, చైతన్యభేరీ సన్నాహాక సమావేశం జరిగింది.జిల్లా వ్యాప్తంగా అన్ని ఏరియాల నుంచి హాజరైన నాయకులు మాట్లాడారు.అనతంరం జిల్లా కమిటీలో మార్పులు చేయడమైనది.
జిల్లా చైర్మన్ గా చేవూరు సుబ్బారావు, అధ్యక్షులుగా బిఎల్‌ శేఖర్, ప్రధాన కార్యదర్శిగా
రాపూరు కృష్ణయ్య ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడమైనది.గత జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను రాష్ట్ర కమిటీలోకి తీసుకోవడం జరిగింది శ్రీమంతులు మురళి రాష్ట్ర జాయింట్ సెక్రటరీ గా నియమించడం జరిగింది 13మందిని కొత్తగా కార్యవర్గంలోకి తీసుకోవడమైనది.
యువజన విభాగం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా యల్లంపల్లి రమేష్, కల్లూరు లక్ష్మణ్ ను ఎన్నుకోవడమైనది. సమావేశంలో కోశాధికారి ఇండ్ల మల్లి, మహిళా కన్వీనర్ చెంబేటి సుమతి పాల్గొన్నారు.