నెల్లూరు, జనవరి 26, (రవికిరణాలు) : నెల్లూరు నగరంలోని మూలపేట నందు గల శ్రీ మూలస్థానేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న మహా కుంభాభిషేకం కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి.అనిల్ కుమార్ పాల్గొని నూతన బంగారు కలశాలతో పునఃప్రతిష్ఠ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు కొండ్రెడ్డి రంగారెడ్డి, పి.రూప్ కుమార్ యాదవ్, లోకిరెడ్డి వెంకటేశ్వర్లు రెడ్డి, వై.వి.రామిరెడ్డి, గోగుల నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.