నెల్లూరు, ఫిబ్రవరి 01, (రవికిరణాలు) : నెల్లూరు స్టోన్ హౌస్ పేటలో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమంలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, నెల్లూరు నగర పాలక సంస్థ మాజీ డిప్యూటీ చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ ఇతర వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు.