ఉత్త‌ర్వులు జారీ చేసిన ఏపీ ప్ర‌భుత్వం
నెల్లూరు, జనవరి 24, (రవికిరణాలు) : ఏపీ మంత్రి మేక‌పాటి గౌతంరెడ్డికి అద‌నంగా మ‌రో శాఖ‌ను కేటాయిస్తూ రాష్ట్ర‌ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇప్ప‌టికే ఆయ‌న పరిశ్రమలు, వాణిజ్య శాఖ, ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ శాఖ‌ల‌కు మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. యువ‌త‌కు ప్ర‌త్యేక శిక్ష‌ణ కోసం నైపుణ్యాభివృద్ధి, శిక్షణ విభాగం పేరిట కొత్త పాలనా శాఖను ప్ర‌భుత్వం ఇటీవ‌ల ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. ఈ శాఖ‌కు మంత్రిగా గౌతంరెడ్డిని నియ‌మిస్తూ ప్ర‌భుత్వం తాజాగా ఉత్త‌ర్వులు జారీ చేసింది.