నెల్లూరు నగరంలోని 44వ డివిజన్ చాకలివీధి, శివప్రియ సెంటర్, రాయజివీధి, ప్రాంతాలలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ అధికారులతో కలిసి పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకొని, వెంటనే సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు నీలి రాఘవరావు, వేలూరు మహేష్, సూరిశెట్టి నరేంద్ర, అశోక్, జయశంకర్, జాకీర్, హరి, మునవర్, పసుపులేటి భాస్కర్, నరసింహారావు, చిన్ని,  తదితరులు పాల్గొన్నారు.