నెల్లూరు, జనవరి 29, (రవికిరణాలు) : నెల్లూరు నగరంలోని జనార్ధన్ రెడ్డి కాలనీ, ఇరుకళల పరమేశ్వరి గుడి వద్ద, కొండ్లపూడి వద్ద హౌస్ ఫర్ ఆల్ పథకం కింద నిర్మించియున్న ఇళ్ళ నిర్మాణాలను, ఇళ్ళ నిర్మాణ స్థలాలను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా|| పి.అనీల్ కుమార్ నెల్లూరు రూరల్ కార్యాలయ ఇన్ చార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితో, అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి అనీల్ కుమార్ మాట్లాడుతూ రాబోవు ఉగాది నాటికి రాష్ట్రంలోని అర్హులైన పేద ప్రజలకు ఉచితంగా ఇళ్ళ స్థలాలను ఇస్తామని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగిందన్నారు. అందులో భాగంగా నెల్లూరు నగరంలోని పలు ప్రాంతాలలో అధికారులతో కలిసి ఇళ్ళ స్థలాల పరిశీలన చేయడం జరిగిందన్నారు. అర్హులైన పేదలందరికీ ఉగాది నాటికి ఇళ్ళ స్థలాలు ఇవ్వడం జరుగుతుందన్నారు.