మంత్రి అనిల్ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాపం పండే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.... 

- అబ్దుల్ అజీజ్, నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి... 

మంగళవారం నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల, క్లస్టర్ ఇంచార్జీల, యూనిట్ ఇంచార్జీల, డివిజన్ ఇంచార్జీల సమావేశం జరిగింది....

ఈ సమావేశం లో రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు, బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డి, పోలిట్ బ్యూరో సభ్యులు మొహమ్మద్ అహ్మద్ షరీఫ్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నక్కా ఆనంద్ బాబు గార్లు, జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, నగర నియోజకవర్గ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి గార్లు పాల్గొన్నారు...

సమావేశం లో అబ్దుల్ అజీజ్ గారు మాట్లాడుతూ....

అధికారం చేతిలో ఉందని నెల్లూరులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన అరాచకాలు, దౌర్జన్యాలు పెట్రేగి పోయాయని అన్నారు.  వీరిని ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉందని టిడిపి నెల్లూరు పార్లమెంటు అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు.  నెల్లూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు, ముఖ్య నేతలు, కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు.  వైసీపీ చేసిన అరాచకాలు నెల్లూరు కార్పొరేషన్ ప్రజలందరూ చూశారన్నారు..ఎల్లకాలం వీరి ఆటలు సాగబోవన్నారు.  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి దుర్మార్గులను ఈ భూమి ఇప్పటివరకు చూడలేదన్నారు.   ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాపాలు పండే రోజులు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు.  వీరిద్దరూ చేసే అరాచకాలను చూసి నెల్లూరు నగర ప్రజలు భయపడుతున్నారన్నారు..ప్రజలు వీరికి సరైన బుద్ధి నేర్పే రోజు దగ్గరలో ఉందని అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు...