చైన్నై నుంచి లివర్,కందనకాయ దిగుమతి చేస్తున్న దుకాణదారులు

అధికారులు తనిఖీ శూన్యం

పొదలకూరు,డిసెంబర్ 29,(రవికిరణాలు) : దుకాణాలలో మాంసం విక్రయదారులు అత్యాశకు పోయి నాణ్యతలేని నిల్వ ఉంచిన మాంసాన్ని అంటగడుతున్నారు. అదేవిధంగా చెన్నై నుంచి నిల్వ ఉంచిన లివర్,కందనకాయ వంటివి దుకాణాదారులు దిగుమతి చేసుకుంటున్నారు. అలాగే కొన్ని దుకాణాలలో రోగాలతో మృత్యువాత పడుతున్న కోడిమాంసాన్ని నిల్వ చేసి మరి విక్రయిస్తున్నారు. ఎలాంటి అనుమానం రాకుండా ఈ తంతు నిర్వహిస్తున్నారు. దీనితో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు.ఈ విధంగా ఉంటే తనిఖీ చేయాల్సిన అధికారులు వాటి వైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు.ఇకనైనా అధికారులు మేల్కోని మాంసం మాఫియాకి అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుకుంటున్నారు