గూడూరు, జనవరి 17, (రవికిరణాలు) : గూడూరు పట్టణములోని "అల్లూరు ఆదిశేషారెడ్డి స్టేడియం" నందు ఎన్‌పిఎల్‌ నెల్లూరు ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభ కార్యక్రమంలో భాగంగా ముఖ్యఅతిధులుగా వైసిపి నాయకులు, చేగువేరా ఫౌండేషన్ వ్యస్థాపకులు మండ్ల సురేష్ బాబు, కనుమూరి చారిటబుల్ ట్రస్ట్ అధినేత కనుమూరి హరిచంద్రా రెడ్డి పాల్గొన్నారు. ఈ ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన ఎన్‌పిఎల్‌ కమిటీ సభ్యులు
మస్తాన్, చంద్రనీల్,అనిల్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మునిగిరీష్, ఉదయ్ భాస్కర్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.