ప్రగతి సేవా సంస్థ గూడూరు ఆధ్వర్యంలో మహాత్మా గాంధీజీ జీవిత చరిత్ర యొక్క జాతీయ దేశభక్తి పాదయాత్రను తమిళనాడులోని మధురై వాసులు గాంధేయవాదులు కురుప్పయ్య, చరిత్ర దంపతులు జిల్లాలోని సీతమ్మ పాలెం గాంధీ, కస్తూర్బా జి ఆశ్రమం నుండి గాంధీ జీవిత చరిత్ర పాదయాత్ర ప్రారంభించి మంగళవారం గూడూరుకు విచ్చేసిన వీరికి ప్రగతి సేవా సంస్థ ఘన స్వాగతం పలికి గాంధీ మహాత్మునికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వీరి పాదయాత్రలో పాల్గొని వారికి ఘన వీడ్కోలు తెలియజేశాము. ఈ పాదయాత్ర కార్యక్రమం మార్చి 12వ తేదీ వరకు కొనసాగి హైదరాబాద్ గాంధీ భవన్ వరకు చేరుతుంది. ఇది 45 రోజులు 1000 కిలోమీటర్లు ఈ పాదయాత్ర కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు వేమారెడ్డి సురేంద్రనాథరెడ్డి, సెక్రెటరీ జి.చంద్రశేఖర్, ట్రెజరర్ కాటూరి శ్రీనివాసులు, సభ్యులు వాకాటి రామ్మోహన్,ఎమ్‌.మస్తానయ్య ఎస్‌ఎల్‌వి ప్రసాద్, గిరి, చిరంజీవి గౌడ్, మురళి తదితరులు పాల్గొన్నారు.