పోలేరమ్మ సద్ది ఉత్సవంలో ఎంపీ ఆదాల
 అల్లూరు గ్రామ దేవత పోలేరమ్మ సద్ధి ఉత్సవంలో నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కాకాని గోవర్ధన్ రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిలతో కలసి పాల్గొన్నారు. మంగళవారం అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. సద్ధి ఊరేగింపులో విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి , జడ్పిటిసి మల్లు సుధాకర్ రెడ్డి, సుకుమార్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ స్వర్ణ వెంకయ్య, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. సద్ది ఊరేగింపు అల్లూరు పేట ప్రధాన వీధుల గుండా సాగింది. పటిష్ట బందోబస్తు తో ముందుకు సాగిన ఊరేగింపులో సంప్రదాయ నాట్యకారిణిల వాహన వేదిక ఆ తర్వాత మేళతాళాలు డప్పు వాయిద్యాలు లతో కోలాహలంగా సాగింది. బాణసంచాతో పట్టణమంతా మార్మోగింది. ఊరేగింపు అనంతరం మహిళలు సద్ది ని అమ్మవారికి సమర్పించారు. ప్రముఖులు అమ్మవారిని దర్శించి ఆశీస్సులు పొందారు. ఈ ఊరేగింపు వల్ల అల్లూరు పట్టణం