విజయవాడ: విజయవాడ ఎంపీ కేశినేని నానిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. అమరావతిలోనే ఏపీ రాజధానిని కొనసాగించాలంటూ ప్రకాశం బ్యారేజీపై నిరసన కార్యక్రమానికి రాజధాని పరిరక్షణ సమితి పిలుపునిచ్చింది. అయితే, మంత్రివర్గ సమావేశం దృష్ట్యా దీనికి పోలీసులు అనుమతి నిరాకరించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద నిర్వహించ తలపెట్టిన నిరసనకు వెళ్తారనే ఉద్దేశంతో తెదేపా ఎంపీ నానిని విజయవాడలోని ఆయన నివాసంలోనే నిర్బంధించారు. ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.