కందుకూరు, డిసెంబర్‌ 27, (రవికిరణాలు) : కందుకూరు పట్టణంలో శుక్రవారం పలు అభివృద్ధి పనులకు నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఎనిమిదో వార్డులో ఆది ఆంధ్ర కాలనీలో 44లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే అంతర్గత,ప్రధాన సీసీ కాలువ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బృందావనంలో 66 లక్షల రూపాయలతో నిర్మించే సిసి రోడ్లు కాల్వల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అంతకుముందు వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యే తో కలిసి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ రెండు ప్రాంతాల్లోనూ స్థానికుల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఎమ్మార్వో కార్యాలయంలో పలువురు మహిళలకు ఇంటి నివేశన స్థలాల పట్టాలు ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో విజయ డైరీ ఛైర్మన్ రంగారెడ్డి, స్వర్ణ వెంకయ్య, సుధాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.