సూళ్లూరుపేట,డిసెంబర్ 29, (రవికిరణాలు) : సూళ్లూరుపేట పట్టణ పరిధిలోని జూనియర్ కళాశాల నందు జనవరి 3,4,5 జరగనున్న ఫ్లెమింగో ఫెస్టివల్ ఏర్పాట్లను ఆదివారం జిల్లా కలెక్టర్ శేషగిరి బాబు,సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కలిసి సంయుక్తంగా పరిశీలించారు. జూనియర్ కాళాశాలలో జరుగుతున్న పనులు పరిశీలించారు. అనంతరం బీవీ పాలెం, నేలపట్టు ప్రాంతాలలో కూడా ఏర్పాట్లను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట పట్టణ అధ్యక్షుడు కళత్తూరు శేఖర్ రెడ్డి,రూరల్ అధ్యక్షుడు అనిల్ రెడ్డి, చెంగాళమ్మ ఆలయ ట్రస్ట్ చైర్మన్ బాలచంద్ర రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నరేంద్ర కుమార్, తదితరులు పాల్గొన్నారు.