సూళ్ళూరుపేట మండలంలోని కోన్నేంబట్టు గ్రామ ప్రజలు కొన్నేంబట్టు శ్మశాన వాటిక పునరుద్ధరణ కోసం  సూళ్లూరుపేట మండల కార్యాలయం వద్దకు వచ్చి MPP అల్లూరు అనిల్ రెడ్డి కి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అర్జీ ఇచ్చారు. 


 MPP అనిల్ రెడ్డి  మాట్లాడుతూ  సూళ్ళూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య  నియోజకవర్గంలో ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూన్నరు అని ఆయన తెలియజేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం MLA కిలివేటి సంజీవయ్య  ఏళ్లవేళల కృషి చేస్తున్నారని తెలిపారు. వెంటనే MPP అల్లూరు అనిల్ రెడ్డి  సంబందిత అధికారులకు ఫోన్ చేసి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.మీకు ప్రతినిత్యం అందుబాటులో ఉంటామని చెప్పారు.