వెంకటాచలం, ఫిబ్రవరి 05, (రవికిరణాలు) : నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలంలో ఆంధ్ర రాష్ట్ర వికేంద్రీకరణకు మద్దతుగా యువకులు నిర్వహిస్తున్న రిలే దీక్షలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి మద్దతు పలికారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కాకాణి మాట్లాడుతూ అమరావతితోనే అభివృద్ధి ఆగిపోకూడదని, రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని, అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తుంటే, చంద్రబాబు మాత్రం అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు.చంద్రబాబు అమరావతిలోని తన అక్రమ ఆస్తుల విలువలు పడిపోతాయని, కొందరిని రెచ్చ గొట్టే చర్యలకు పాల్పడుతున్నాడు.రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పై ప్రజలు మాట్లాడుకోనివ్వకుండా, అమరావతి ఉద్యమం పేరుతో చంద్రబాబు కుట్రలు పన్నుతున్నాడు.జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో వెనుకబడిన ప్రాంతాలతో పాటు, అన్ని ప్రాంతాలలో అభివృద్ధి జరుగుతుంది.చంద్రబాబు తీరు చూస్తే ఆయన అక్రమ ఆస్తులు ఉన్న అమరావతిలో తప్ప, ఎక్కడా అభివృద్ధి జరగకూడదనే విధంగా ఆయన తీరు ఉంది.అమరావతిలోనే మొత్తం అభివృద్ధి చేసి, మరో తెలంగాణ ఉద్యమం రాకుండా ఉండేందుకు అన్ని ప్రాంతాల్లో అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు.అమరావతి అభివృద్ధికి ఏనాడు జోలెపట్టని చంద్రబాబు, ఆయన అక్రమ ఆస్తులను, దళితుల వద్ద బలవంతంగా లాకున్న భూములు పోతాయని జోలీ పట్టడం సిగ్గుచేటు.తప్పనిసరిగా పరిపాలన వికేంద్రీకరణ జరిగి తీరాల్సిన అవసరం ఉంది.జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి ప్రజలందరూ 
హర్షం వ్యక్తం చేస్తున్న తరుణంలో ఇకనైనా చంద్రబాబుకు బుద్దిరావాలి.అన్ని వర్గాలతో కలసి త్వరలో ఒక కార్యచరణ రూపొందించి, జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి మద్దతుగా నిలుస్తాము.
పరిపాలన వికేంద్రీకరణతోనే అభివృద్ధి జరుగుతుందని ముందుకు వచ్చిన యువతకు నా అభినందనలు అని అన్నారు.