మంగళగిరి టిడిపి జాతీయ కార్యాలయం నందు ఎంజిఎన్ఆర్ఈజీఎస్ ఫిర్యాదుల విభాగంలో నరేగా మాజీ కౌన్సిల్ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర . ఎంజిఎన్ఆర్ఈజీఎస్ పథకం ద్వారా ఒంగోలు జిల్లాలో పెండింగ్ లో ఉన్న హార్టికల్చర్  బిల్లులు బాధితులు మరియు  అనంతపురం జిల్లా లో గ్రావెల్ రోడ్ల బాధితుల సమస్యలపై కౌన్సిల్ సభ్యులతో చర్చించడం  జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఎన్ఆర్ఈజీఎస్ బిల్లులను త్వరగా మంజూరు చేసేలా  ప్రభుత్వం పై ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు.  ఈ సమావేశంలో పాల్గొన్న కౌన్సిల్ మాజీ సభ్యులు వీరంకి గురుమూర్తి, లక్ష్మి సుభాషిణి, పీరయ్య, ఎంవి. ఎస్ చౌదరి తదితరులు.