నెల్లూరు, డిసెంబర్‌ 29, (రవికిరణాలు) : నెల్లూరు నగరంలోని 5వ డివిజన్ బోడిగాడితోట, సత్యనారాయణపురం, వైకుంటపురం ప్రాంతాలలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి.అనిల్ కుమార్ అధికారులతో కలిసి పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకొని, వెంటనే సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వై.ఎస్.ఆర్.సి.పి నాయకులు ముక్కాల ద్వారకనాథ్, ఓబిలి రవిచంద్ర, ఎ.శోభన్ బాబు, లెక్కల వెంకారెడ్డి, సానా నారాయణరెడ్డి, సానా శ్రీహరిరెడ్డి, సిద్ధు రమణా రెడ్డి, కాశిరెడ్డి, వెంకటేశ్వర్లు రెడ్డి, సునీల్, సంక్రాంతి కళ్యాణ్, పోలంరెడ్డి వెంకటేశ్వర్లు రెడ్డి, దార్ల వెంకటేశ్వర్లు, ఎర్రంరెడ్డి మాధవరెడ్డి, వంగాల శ్రీనివాసులు రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.