నెల్లూరు నగరంలోని 50వ డివిజన్ ఉప్పరపాళెం, పొర్లుకట్ట, పినాకిని పార్కు, మాగుంట నగర్ ప్రాంతాలలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ అధికారులతో కలిసి పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకొని, వెంటనే సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు కొణిదల సుధీర్, వందవాశి రంగా, శ్రీనివాసరావు, కదిర్ ఖాన్, నాని, రమేష్, సునీల్ రెడ్డి, గంధం సునీల్, మహేంద్ర, రంగా, శౌరి, మస్తాన్, ఎస్.కే. మున్నా, ప్రభాకర్, పెంచలయ్య, బిందు, రాఘవేంద్ర, ఆర్.ఉదయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.