పట్టణంలోని స్థానిక ప్రజా వైద్యశాల నందు  డాక్టర్ సి కళాధర్, ఆధ్వర్యంలో కరోనా వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కరపత్రిక రూపంలో విడుదల చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా  వెంకటగిరి రాజా సంస్థానాధీశులు డాక్టర్ వి.బి సాయికృష్ణ యాచేంద్ర, సర్వజ్ఞ కుమార యాచేంద్ర లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయికృష్ణ యాచేంద్ర మాట్లాడుతూ, ప్రపంచాన్ని గడగడ లాడిస్తున్న కరోనా వైరస్ బారీన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రజలకు తెలియజేయాలన్న ఆలోచనను కరపత్రాలు రూపంలో ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చేలా చేసిన ప్రయత్నానికి డాక్టర్ కళాదర్ కి మనఃపూర్వక అభినందనలు తెలిపారు. కరోనా వైరస్ పై   ప్రజలు అవగాహన పెంచుకోవాలని, అలాగే ముందస్తు జాగ్రత్తగా చేతులు శుభ్రపరుచుకోవడం, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ,తుమ్ములు ,జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అలాంటివి ఏమైనా ఉన్నట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆయన తెలియజేశారు. జనసంచారం ఎక్కువ ఉన్న ప్రదేశాలలో తిరిగే సమయంలో  మాస్క్ లు తప్పక ధరించాలని   ఆయన తెలియజేశారు.   ఈ కార్యక్రమంలో పునుగోటి సుబ్రహ్మణ్యం నాయుడు,  గొల్లగుంట వెంకట ముని,  గొల్లగుంట మురళి , శ్రీధర్  తదితరులు పాల్గొన్నారు.