నెల్లూరు, పిబ్రవరి 09, : నేడు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో 12వ డివిజన్, వావిలేటిపాడు ముస్లిం మైనారిటీ టిడిపి సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ లు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయం ఇంచార్జ్ కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది. 500 మంది ముస్లిం సోదరులతో పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. వావిలేటిపాడు ముస్లిం నాయకులు వాళ్ళ సొంత బిడ్డల్లా మమ్మల్ని ఆదరిస్తున్నారని అన్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన నాయకులు గౌరవం పెంచే విధంగా పని చేస్తామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని నెరవేరుస్తూ, అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ముందుకు పోతున్నారని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్చార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పేర్కొన్నారు.