బుధవారం సంయుక్త కలెక్టరు, నెల్లూరు వారు పేదలందరికి ఇళ్లు కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు డివిజన్లో చేజర్ల మండలంలోని యన్.వి.కండ్రిగ గ్రామంలో గల ఇళ్ళ స్థలాలను పరిశీలించారు. సదరు తనిఖిలో ఇళ్ళ స్థలాల కోసం సేకరించిన భూమి నందు ఎటువంటి లెవలింగ్, జంగిల్ క్లియరెన్స్, స్టోన్ ప్లాంటింగ్ చేయనందుకు ఏ.పి.ఓ, యన్.ఆర్.ఇ.జి.యస్, చేజర్ల, సర్వేయర్, చేజర్ల తహాశిల్దారు, చేజర్ల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 రోజుల వ్యవధిలో అంతా చదును చేయవలసినదిగా ఆదేశించారు. పై కార్యాక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి, ఆత్మకూరు ఉమాదేవి, తహశీల్దారు, చేజర్ల సుధాకర్, ఇతర అధికారులు పాల్గొనారు.