రాపూరు, జనవరి 06, (రవికిరణాలు) : ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచలకోనలో వెలసియున్న శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామి వారు వైకుఠద్వారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర దేవాదయశాఖ కమీషనర్‌ పద్మజ, సహాయ కమీషనర్‌ రవీంద్ర పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితులు మంత్రోచ్చరణలతో స్వామి వారి పట్టువస్తాలను అందజేశారు. ఈ సందర్భంగా దేవాలయం ఈవో జె.వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి రోజున స్వామి వారికి ప్రత్యేక అలంకారాలు నిర్వహించమన్నారు.