జగనన్న మాట - కార్యకర్తల ఇళ్ళకి కోటంరెడ్డి బాట కార్యక్రమం 35వ డివిజన్లో 48వ రోజు నిడారంబరంగా ప్రారంభమైంది.  ఉదయం 7 గంటలకు కైలామ్ కిరణ్ అనే కార్యకర్త ఇంటి నుండి మొదలైన జగనన్న మాట - కార్యకర్తల ఇళ్ళకి కోటంరెడ్డి బాట.  నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 35వ డివిజన్, నీలగిరి సంగంలో ఈదూరు సుశీలమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకొని, ప్రతీ కార్యకర్తతో, ప్రతీ నాయకునితో వారి ఇంటిలోనే ఏకాంతంగా మాట్లాడుతూ, ఒక కార్యకర్త ఇంటి నుండి మరో కార్యకర్త ఇంటికి వెళ్లే మార్గమధ్యలో స్థానిక ప్రజలతో మాట్లాడుతూ, వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ, సంక్షేమ పథకాలగురించి ఆరాతీస్తూ ముందుకు సాగిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి