నెల్లూరు నగరానికి విచ్చేసిన మాజీ కేంద్రమంత్రి బిజెపి నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరిని
 జనసేన నెల్లూరు జిల్లా నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి స్వగృహంలో మర్యాద పూర్వకంగా కలిసి శాలువా తో సత్కరించి పుష్పగుచ్ఛం అంద చేశారు.
బీజేపీ జనసేన పొత్తుతో రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరాడేందుకు ఒక ప్రత్యామ్నాయ శక్తి ఏర్పడిందని ఆవిడ తెలియచేశారు..సీనియర్ నాయకురాలు,గతంలో కేంద్రంలో మంత్రిగా పని చేసిన అనుభవం ఉన్న పురందేశ్వరిని కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని కేతంరెడ్డి తెలియచేశారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పావుజెన్నీ చంద్రశేఖర్ రెడ్డి,కాకు మురళి రెడ్డి,జయదేవ్,విష్ణు తదితరులు పాల్గొన్నారు.