అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎబివిపి నాయుడుపేట శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద యువజనోత్సవాలు లో భాగంగా మొదటి రోజు విద్యార్థులకు కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నాయుడుపేట సీఐ వై.వి. సోమయ్య గారు మరియు ముఖ్య వక్తగా ఎబివిపి జిల్లా కన్వినర్ కార్తీక్, నెల్లూరు విభాగ్ ఫార్మసీ కన్వీనర్ భాను ప్రకాష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తరుణ్, సహా బాగ్ కన్వీనర్ లక్ష్మి నారాయణ, నగర కార్యదర్శి పవన్ కుమార్,చందు తదితరులు పాల్గొన్నారు.