నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కాకుపల్లి గ్రామంలో గ్రామ సచివాలయాన్ని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ వినోద్ కుమార్ బాబు ప్రారంభించారు.గత ప్రభుత్వంలో ప్రజలు కార్యాలయాల చుట్టు తిరిగి, ప్రజలుపడే ఇబ్బందులు గుర్తించి ప్రజలవద్దకే పాలన తీసుకురావల్లన్న ఉదేశంతో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఈ సచివాలయాలను ప్రారంభించటం ఎంతో గొప్ప విషయమని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు.వార్డు, గ్రామ సచివాలయాల ద్వారా దేశ చరిత్రలోనే సరికొత్త అధ్యాయానికి నాంది పలికిన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అని కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పేర్కొన్నారు.