నెల్లూరు, ఫిబ్రవరి 05, (రవికిరణాలు) : నెల్లూరు నగరంలోని 46వ డివిజన్‌కు చెందిన తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి చీదెళ్ళ కిషన్, వారి మిత్రబృందం దాదాపు 100 మంది, అలాగే 49వ డివిజన్ కు చెందిన టిడిపి నాయకులు ఎస్.కే.నజీర్, వారి మిత్రబృందం దాదాపు 100 మంది ఇస్కాన్ సిటీ నందు గల మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి.అనిల్ కుమార్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరగా, వారికి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వై.వి.రామిరెడ్డి, వేలూరు మహేష్, వందవాషి రంగా, నీలి రాఘవ రావు, పెంచలయ్య, తదితరులు పాల్గొన్నారు.