నెల్లూరు : నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు మిద్దె శ్రీనాధ్ యాదవ్, 18వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు బండ్ల శ్రీనివాసులు, షేక్ అమన్ మరియు వీరి మిత్రబృందంతో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరారు. మ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వారికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ, …నన్ను నమ్ముకున్న, నా వెంట నడిచిన కార్యకర్తలకు ఎల్లప్పుడు అండగా ఉంటానన్నారు.సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు చేస్తోన్న అభివృద్దిని చూసి ఎంతోమంది నాయకులు వైసీపీలో చేరుతున్నారన్నారు. త్వరలో జరగబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో నెల్లూరు రూరల్లో 100 కి 100 శాతం అన్ని స్థానాలను వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేసారు.