సావిత్రీ భాయ్ గారి జయంతి సందర్బంగా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ గారి సూచనలతో...
మనకి ఒకే ఒక ఒక శత్రువు ఉన్నాడు.. దాని పేరే అజ్ఞానం, విద్యావంతులమై ఆశత్రువును తరిమివేయటమే మన లక్ష్యం....కులమతాలకు అతీతంగా విద్యా హక్కు కలిగిఉండాలనీ కృషి చేసిన భారత దేశపు మెట్ట మొదటి మహిళా ఉపాధ్యాయిని సావిత్రీ భాయ్ గారి జయంతి సందర్బంగా జనసేన పార్టీ తరపున ఘన నివాళి....

వెనుకబడిన వర్గాల అనిచి వేతకు తిరుగుబాటు చేసిన విప్లవకారుడు జ్యోతిరావు పూలే చరిత్ర కెక్కగా భర్తకు తగ్గ భార్య గా సావిత్రిభాయ్ గారు మహిళా సాధికారతకు ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. మహిళా విద్యకు ముఖ్యంగా అట్టడుగు వర్గాలకు చెందిన స్త్రీలు చదువుకునేందుకు అందరూ విద్యా హక్కు కలిగి ఉండాలనే భావంతో మహిళల కోసం ఒక ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేసి బారత దేశం లోనే మొట్టమొదటి మహిళా అధ్యాపకురాలిగా చరిత్రకెక్కారు, భర్తతో కలిసి సత్యశోధక్ సమాజాన్ని ప్రారంభించి బాల్య వివాహాలకు మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడి వితంతువులకు పునర్వివాహలకు  మద్దతుగా నిలిచారు.ముఖ్యంగా భారతదేశంలో ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు అన్ని వర్గాల వారికి వైద్య సహాయం అందించాలని ప్రభుత్వం చేసిన ఒత్తిడి తెచ్చి  ప్రజలకు వైద్య సహాయం అందేలా చూశారు.దళితవాడలో రోగగ్రస్థులకు సేవ చేస్తూ,చివరికి అదే వ్యాధి తనం పరమపదించారు. కులమతాలకతీతంగా అనాదలపై అందరు ప్రేమకు చూపించాలని బ్రాహ్మణ కులానికి చెందిన అనాధ దత్తత తీసుకున్న మాతృమూర్తి జయంతి సందర్భంగా. జనసేన పార్టీ తరఫున ఘన నివాళులర్పిస్తున్నాము. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎల్లప్పుడూ వివరించినట్లుగా,ఎన్నడూ అధికారం చూడని కులాలు రాజ్యాధికారం చేపట్టే దిశగా జనసేన పార్టీ తరఫున కృషి చేస్తామని తెలిపారు

సావిత్రి బాయి పూలే గారి జయంతి సందర్భంగా మినీ బైపాస్ నందు గల జ్యోతిరావు పూలే,సావిత్రి గార్ల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు, ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకులు కిషోర్ సిటీ నాయకులు దుగ్గి శెట్టి సుజయ్ మాట్లాడుతూ....