నెల్లూరు, డిసెంబర్‌ 27, (రవికిరణాలు) : ప్రస్తుత పరిస్థితులలో రాజ్యాంగ పరిరక్షణ కొరకు నెల్లూరు జిల్లాలో పార్టీలకు మతాలకు, కులాలకు అతీతంగా ఒక జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసుకొని రాజ్యాంగ పరిరక్షణ కొరకు పాటుపడాలని నిర్ణయించడం జరిగిందని భారత రాజ్యాంగ పరిరక్షణ జాయింట్ యాక్షన్ కమిటి తెలియజేసింది. ఈ సందర్భంగా శుక్రవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌ నందు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జెఏసి అధ్యక్షులు మౌలానా మహమ్మద్ ఇలియాజ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో వున్న అధికరణ 14, అధికరణ 21 విరుద్ధంగా పాలకులు తీసుకుంటున్న నిర్ణయాలు పక్షపాతంతో వున్నాయని భారతదేశ
ప్రజలను విచక్షణకు గురౌతున్నారని, హింసకు దారితీస్తున్నారని చెప్పారు. అధికరణ 14, 21 ప్రకారం సమానత్వ హక్కు వుందని దాన్ని కాలరాయడానికి ప్రభుత్వం చేస్తున్న చర్యలు ఎంతో హేయమైనవని తెలిపారు. అందుకని ప్రతి ఒక్కరు రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సోదరభావం, సామరస్యంతో మెలగాలి సి.ఏ.ఏ., ఎన్.పి.ఆర్. ఎన్.ఆర్.సి. ని ముక్తకంఠంతో భారతదేశ ప్రజలందరు ఖండించాలని పిలుపునిచ్చారు. తదనంతరం నవీద్‌బాయి మాట్లాడుతూ గాంధి చూపించిన దారిలో మేము నిరసన వ్యక్తము చేస్తామన్నారు. మా నిరసన సి.ఏ.ఏ. ఎన్.పి.ఆర్. ఎన్.ఆర్.సి. ని వాపసు తీసుకోవాలని
డిమాండు చేసారు. ఈ యొక్క చట్టాలతో భారతదేశంలో వున్న ప్రతి ఒక్క పౌరుడికి నష్టం కలుగుతుందని వాపోయారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ కరిముల్లాబాయి, నవీద్ బాయి కరీంబాయి, జాకీర్ బాయి, షఫిబాయి, హయాదాబాయి, మౌలాన సుహేబ్, తదిదరులు పాల్గొన్నారు.