నెల్లూరు నగర, రూరల్ నియోజకవర్గాలలోని అల్లీపురం నందు మురుగునీటి శుద్ధి కర్మాగారం, జనార్ధన్ రెడ్డి కాలనీలో టిడ్కో గృహాలు పొందిన లబ్దిదారులచే గృహప్రవేశం, పొగతోట ఎస్2 హాల్ వద్ద ఆధునిక మరుగుదొడ్ల ప్రారంభ కార్యక్రమం, శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో స్వామి వారి పుష్కరిణి పుననిర్మాణ కార్యక్రమం, నగరపాలక సంస్థ కార్యాలయ ప్రాంగణం నందు కమాండ్ కంట్రోల్ సెంటర్ మరియు కమిషనర్ నగరపాలక సంస్థ వారి క్యాంపు ఆఫీస్ మరియు నివాస భవన నిర్మాణానికి శంకుస్థాపన, సఫాయి మిత్రలకు వాహనాల పంపిణీ కార్యక్రమాలలో  రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి డాక్టర్ పి.అనీల్ కుమార్ గారు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి  శాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ గారితో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నుడా చైర్మన్ ముక్కాల ద్వారకనాథ్, స్వచ్చ కార్పొరేషన్ చైర్మన్ పానకా దేవసేనమ్మ, తదితరులు పాల్గొన్నారు.