నెల్లూరు, డిసెంబర్‌ 27, (రవికిరణాలు) :  నెల్లూరు నగరంలోని స్థానిక 25 కళా సంఘాల కార్యాలయం నందు పేద కళాకారుల సహాయార్థం.. సాంస్కృతిక కార్యక్రమాలు గోడ పత్రికావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ నగరంలోని పురమందిరం మందు నెల్లూరు జిల్లా సినీ ఆర్కెస్ట్రా, ఈవెంట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పేద కళాకారులకు సహాయం అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తారని నెల్లూరు పట్టణ ప్రజలు పేద కళాకారులకు సహాయం చేసే ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హరిబాబు, హరి ప్రసాద్ రెడ్డి,భాస్కర్, సూర్య రాజా, రవితేజ, కోసూరు రత్నం, కేధార్‌, రాజా, శేషం తదితరులు పాల్గొన్నారు.