రాపూరు, జనవరి 22, (రవికిరణాలు) : కండలేరు డ్యామ్ నందు 2021-22 విద్యా సంవత్సరంలో హార్టికల్చర్ పాలిటెక్నిక్ ప్రారంభించడానికి అవసరమైన చర్యలను సత్వరమే చేపట్టడానికి ఆర్థిక శాఖ, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో చర్చించిన మాజీ మంత్రి వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అమరావతి వెళ్లిన ఆనం నేడు వ్యవసాయ, హార్టికల్చర్ శాఖ, ఆర్థిక మంత్రిత్వ అధికారులతో సమావేశమై, వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని రాపూరు మండలంలోని సుప్రసిద్ధ తెలుగుగంగ ప్రాజెక్టు రిజర్వాయర్ కండలేరు డ్యామ్ వద్ద నూతన హార్టికల్చర్ పాలిటెక్నిక్ మంజూరుకు సత్వర
చర్యలు చేపట్టి ఈ ప్రాంత ప్రజల నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పరచడానికి సహకరించాల్సిందిగా కోరారు.